Illegal Sand Mining in Bapatla District : ఇసుక అక్రమ వ్యాపారం బాపట్ల జిల్లా చీరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో జోరందుకుంది. ఇసుక రవాణాకు ఎటువంటి అనుమతుల్లేకపోయినా పెద్దల అండతో దర్జాగా అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. దీనిపై అధికారులూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో యథేచ్ఛగా జేసీబీలు పెట్టి మరీ తవ్వేస్తున్నారు.