Illegal Sand Mining in P. Gannavaram in Konaseema District : ‘మా వెనక మంత్రి ఉన్నారు పది నిమిషాల్లో ఇక్కడ ఎమ్మార్వో ఉండడు, వీఆర్వో ఉండడు’ అంటూ అక్రమార్కులు హెచ్చరించిన ప్రదేశం నుంచే అక్రమంగా వనరులు ఇంకా తరలిపోతున్నాయి. పట్టించుకోవలసిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. పి.గన్నవరం మండలం మానేపల్లి లంక భూముల్లోంచి అనుమతులు లేకుండా గోదావరి నదీపాయకు అడ్డుకట్టలు వేసి మరీ అక్రమంగా మట్టి, ఇసుక, తువ్వ ఇసుక తరలిస్తున్న వైనంపై ఇప్పటికే స్థానికులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.