Illegal Ration Rice Seized in NTR District : ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ మాఫియా ఆగడాలు మితిమిరిపోతున్నాయి. చౌక బియ్యం అక్రమ రవాణాలో ఆరితేరిన వర్గాలు ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ముఠా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని మరో వర్గం అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన ఆ గ్రూప్‌కు చెందిన వ్యక్తులు ప్రత్యర్థులపై దాడికి పాల్పడి కారుతో ఢీ కొట్టారు. ఇది చూసి అక్కడి ప్రజలకు భయాందోళనకు లోనయ్యారు.