Yashwanth Got MS Seat in New York University: ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుగోడలుగా నిలిచినా పరిస్థితులను నిందిస్తూ కూర్చోలేదు ఆ యువకుడు. జీవితం విసిరిన సవాళ్లను ధైర్యంగా స్వీకరించాడు. ఎదురుదెబ్బలకు లొంగిపోకుండా ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఆశయానికి బాటలు వేసుకున్నాడు. ప్రపంచంలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో ఒకటైన టాండన్‌లో ఎంఎస్ సీటు సంపాదించి కలల వేటకు సిద్ధమయ్యాడు. టాలెంట్‌కు పట్టుదల తోడైతే అసాధ్యమేదీ లేదని నిరూపిస్తున్నాడు ఈ తెలుగు తేజం.