Govt Focus On Excise Revenue : రాష్ట్రంలో ఆబ్కారీ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. అక్రమ మద్యాన్ని పూర్తిగా నిలవరించడంతో పాటు గుడుంబా తయారీ, సరఫరాలను నిలువరించాలని నిర్ణయించింది. 36 వేల కోట్లకుపైగా వస్తున్న ఆదాయం ఈ ఆర్థిక ఏడాదిలో 40 వేల కోట్లను దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ విభాగాలతో పాటు ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేసింది.