గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక బీఆర్ఎస్ పార్టీ ఉందని రాష్ట్ర దేవదాయ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. బీఆర్ఎస్ నేత, గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ద్వారా కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గురుకులాల్లో అనుచరులు ఉన్నారని మంత్రి ఈ ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకులాల్లో అక్రమాలు జరిగాయని మంత్రి విమర్శించారు.