Fire Station Issue In Husnabad : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లోని ఓ గదిలో ఫైర్ స్టేషన్ కొనసాగుతుండగా వ్యవసాయ మార్కెట్ గది నిర్వాహకులు ఖాళీ చేయించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మామిడి సీజన్ కావడంతో మామిడికాయలు పెట్టుకోవడానికి అగ్నిమాపక స్టేషన్కు గదిని ఇచ్చిన నిర్వాహకులు ఖాళీ చేయించారని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.