Cancer Cases in Balabhadhrapuram : నిత్యం పంటలతో సస్యశ్యామలంగా ఉండే ప్రాంతం. సిరిసంపదలు, పాడి పంటలకు లోటులేని గ్రామం. మారిన కాలానుగుణంగా అభివృద్ధి దిశగా ముందడుగు వేసిన ఊరు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన జనం. ఇవన్నీ చూసి ఆ విధికి కన్నుకుట్టిందో ఏమో కానీ గత రెండు మూడేళ్ల నుంచి క్యాన్సర్ భూతం విజృంభిస్తుంది. 20 వరకు మరణాలు, 200 మంది వ్యాధిగ్రస్తులతో అల్లాడిపోతుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక జనం కన్నీరు పెడుతున్నారు. ఇదీ తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురం దుస్థితి. ఈ గ్రామ దయనీయ పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.