Actor Balakrishna On Cancer Hospital : క్యాన్సర్‌ను జయించాలంటే మందులతో పాటు మనోధైర్యం చాలా అవసరమని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. అంతర్జాతీయ చైల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా బసవతారకం ఆసుపత్రిలో పీడియాట్రిక్ అంకాలజీ యూనిట్‌తో పాటు పీడియాట్రిక్ అత్యవసర చికిత్స విభాగాన్ని ఆయన ప్రారంభించారు.