Balabhadhrapuram Cancer Cases : క్యాన్సర్ కోరల్లో చిక్కుకున్న బలభద్రపురంలో వ్యాధి లెక్కలు తేలుతున్నాయి. అసలు ఎంతమంది ఈ వ్యాధి బారినపడ్డారు? ఎంతమంది మృతి చెందారనే? అంశంపై అధ్యయనం చేసిన నివేదిక వచ్చింది. మృతుల్లో మహిళలే ఎక్కువ శాతం ఉండటం ఆందోళన కలిగిస్తుంటే, పురుషుల్లో ఊపిరితిత్తులు, లివర్ సమస్యలతో మరణించినవారు అధికంగా ఉన్నారు. నోటితో ఆహారం తీసుకునేందుకు కొందరు ఇబ్బందిపడుతున్నారనే అంశం నివేదికలో తేటతెల్లమైంది.