last year

13-02-2022 నుంచి 19-02-2022 వరకు మీ వార రాశిఫలితాలు

Webdunia Telugu
Webdunia Telugu
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము

ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. కొన్ని సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. విమర్శలు మీలో పట్టుదలను రేకెత్తిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆది, సోమ వారాల్లో పనులు సాగవు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. రిప్రజెంటేటిలకు ఒత్తిడి అధికం.

Browse more videos

Browse more videos