Central Ministers in Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని, ప్లాంట్‌ను పునరుద్ధరిస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రతినిధులతో కేంద్రమంత్రి కుమారస్వామి సమావేశం అయ్యారు. అధికారులు, కార్మిక ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమైన కుమారస్వామి, స్టీల్‌ప్లాంట్ ప్రత్యేక ప్యాకేజీ వినియోగంపై చర్చించారు. అనంతరం మరో ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీలు భరత్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులతో కలిసి కుమారస్వామి మీడియాతో మాట్లాడారు.