Minister Narayana on Environment Conservation in AP: రాష్ట్రంలో తీరప్రాంత అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంయుక్త ఆధ్వర్యంలో తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ఇందులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. భారతీయ సాంకేతికతతో ప్రకృతి వైపరీత్యాలను అధిగమించే అంశాలపై సదస్సులో చర్చ జరిగినట్లు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు.