Central Minister Kishan Reddy On Heavy Rains : రాష్ట్రంలో ప్రధానంగా పదకొండు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదల వల్ల చాలావరకూ ఆస్తులు కోల్పోవడం, పంట నష్టం వాటిల్లిందని వివరించారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు వచ్చి సమీక్షిస్తాయని వివరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఎప్పటిలానే అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.