Heavy Rains in Medak District : ఉమ్మడి మెదక్ జిల్లాను వరుణుడు వణికిస్తున్నాడు. కుండపోత వానకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులను తలపించేలా రహదారులు మారడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా పాతూరులో 20.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.