మంచు మోహన్‌బాబు కుటుంబంలో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. తిరుపతి సమీపంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటకీయ పరిణామాల మధ్య తన తాత, నాన్నమ్మ సమాధులకు మంచు మనోజ్ నివాళులు అర్పించారు. తన తండ్రిని కలవకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ మనోజ్ ఆరోపించారు.