Lovers Suicide in Car In Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రేమజంట ఆత్మహత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుల్లో ఒకరైన 17 ఏళ్ల బాలిక తన తండ్రి శ్రీరాములుకు ఫోన్ నుంచి వాట్సాప్లో లొకేషన్, మూడు పేజీల లేఖను పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఇవి చూసి భయపడ్డ బాలిక తండ్రి లొకేషన్ చూపించిన ప్రాంతానికి వెళ్లేలోపే ఇద్దరూ మంటల్లో కాలిపోయారు. బాలిక ప్రేమ వ్యవహారం తెలసి బ్లాక్మెయిల్ చేసిన చింటూ కోసం పోలీసులు గాలిస్తున్నారు.