Husband And Wife die In Road Accident In Hyderabad : ఓ యువకుడి మద్యం మత్తు భార్యాభర్తల మృతికి కారణమైంది. వారి ఇద్దరు ఆడపిల్లలను అనాథలుగా మార్చింది. ఎదుగుతున్న వయసులో తోడుగా ఉండాల్సిన తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. తాము పైలెట్ కావాలని అమ్మానాన్న కన్న కలలు కలలయ్యాయని చిన్నారులు విలపించిన తీరు అందరి మనసులను కలిచివేసింది. కంటతడి పెట్టించింది.