Girl Died in Habsiguda Road Accident : బడికెళ్లిన కుమార్తె తిరిగి వస్తుందనుకున్నారు. రోజులాగే వెళ్లిన బిడ్డ కానరాని లోకాలకు వెళ్తుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించి ఉండరు. అనుకోని ప్రమాదంలో టస్కర్ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. బిడ్డా ఒక్కసారి లేరా అని ఘోషిస్తున్న ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. పాఠశాలకు వెళ్తున్న క్రమంలో మృతి చెందిన ఘటన అందరి హృదయాల్ని కలిచివేస్తోంది.