Stella L Panama Ship Issue: కాకినాడ తీరంలో లంగరు వేసిన 'స్టెల్లా ఎల్ - పనామా నౌక కదలికపై తర్జన భర్జన కొనసాగుతోంది. నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాలను పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నేడు పరీక్షలు నిర్వహించనున్నారు. తాజా పరిణామాలపై శుక్రవారం ఎగుమతిదారులు కాకినాడలో అంతర్గత సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు.