Panjagutta Car Incident : హైదరాబాద్‌లోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో నాలుగు రోజుల క్రితం ఓ కారు డ్రైవర్ చేసిన బీభత్సం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాగర్జున సర్కిల్ వద్ద వాహనాల తనిఖీల సమయంలో కారు ఆపకుండా హోంగార్డు రమేశ్‌పైకి దూసుకెళ్లాడు. వాహనాల బ్లాక్ ఫిల్మ్ చెకింగ్‌లో భాగంగా హోంగార్డు తనిఖీల కోసం కారును ఆపేందుకు ప్రయత్నించాడు. డ్రైవర్ సయ్యద్ నజీర్ హోంగార్డును కారుతో కొంత దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ప్రమాదంలో రమేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ ఎస్ఐ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.