House Committee Meeting: విశాఖ డెయిరీ అవకతవకలపై సభాసంఘం భేటీ జరిగింది. ఈ నెల 9వ తేదీన విశాఖ డైరీ సందర్శించాలని సభాసంఘం (హౌస్ కమిటీ) నిర్ణయించింది. అదే రోజు సాయంత్రం కలక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించాలని సభాసంఘం నిర్ణయం తీసుకుంది. విశాఖ డైరీ అవకతవకలపై అసెంబ్లీ కమిటీ హాల్లో సభాసంఘం భేటీ ముగిసింది.