Harish Rao On Congress : కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చడమే తప్పించి, పూడ్చటం రాదంటూ మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సాగర్ కాలువ గండి పడి 22 రోజులవుతున్నా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ కేసులు నమోదు చేయలేదన్న ఆయన, ఏపీలో అధికారులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.