Business Expo Organized by AP Chamber of Commerce in Vijayawada : పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈలకు ఇచ్చే రాయితీలన్నీ వర్తించి కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని అధికారులు పేర్కొన్నారు. పర్యాటక రంగంలో ఉత్తేజం నింపే కొత్త విధానం ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం పొందింది. త్వరలోనే కొన్ని మార్పులు, చేర్పుల తర్వాత అమల్లోకి వస్తుందని ఔత్సాహికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాఫీ, చాక్లేట్ ఫెస్టివల్స్ నిర్వహణ ద్వారా యువతను పర్యాటకంగా ఆకట్టుకునే అంశాల వైపు ప్రభుత్వం దృష్టి సారిస్తోందని విజయవాడలో నిర్వహిస్తోన్న ఏపీ బిజినెస్ ఎక్స్పో నిపుణులు అభిప్రాయపడ్డారు.