Book MY Service APP in Vijayawada : కాలుకదపకుండానే చకచకా అవసరమైన సేవలు పొందే సౌకర్యాలు ఇప్పుడు విస్తృతస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రజల అవసరాలు, వారి జీవన పరిస్థితులకు అనుగుణంగా ఔత్సాహికులు ఆన్లైన్ వేదికగా అంకుర సంస్థలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆహారం నుంచి ఆహ్లాదం వరకు, నిత్యావసరాల నుంచి ఇంట్లోని వస్తువుల రిపేర్లు, శుభకార్యక్రమాలకు అర్చకుల నుంచి పూజా సామగ్రి ఇలా ఎన్నో సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే విజయవాడలో బుక్ మై సర్వీస్ పేరిట సేవలందిస్తోన్న స్టార్టప్ ఇప్పుడు ఎక్కువ మంది ఆదరణ పొందుతోంది.