CM CHANDRABABU FIRE ON YS JAGAN: ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లీ-చెల్లిని కూడా రోడ్డుపైకి లాగిన జగన్ తమను నిందిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. జగన్ లాంటి వ్యక్తులతో రాజకీయాలు చేస్తాననుకోలేదని వ్యాఖ్యానించారు. ఆస్తిలో వాటా ఇవ్వాలంటే తనని విమర్శించకూడదని చెల్లికి కండీషన్లు పెట్టేవాడిని ఏమనాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి కేంద్రం రైల్వే లైన్ ప్రకటన అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.