Clash at Former CM YS Jagan Residence in Tadepalli: మాజీ సీఎం జగన్ని కలిసేందుకు వెళ్లిన ఆ పార్టీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. సమస్యలతో వచ్చిన వారికి ఆర్థిక సాయం అందిస్తారని వైసీపీ ప్రచారం చేసింది. దీన్ని నమ్మి కార్యకర్తలు జగన్ను కలవడానికి పెద్ద ఎత్తున తాడేపల్లిలోని జగన్ నివాసానికి తరలివచ్చారు. కాని అక్కడ జగన్ భద్రతా సిబ్బంది కార్యకర్తలను బయటకు నెట్టేశారు.