TDP MLA Somireddy Comments on YS Jagan : ఆస్తి కోసం తల్లి, చెల్లినే జగన్ బెదిరించడం దారుణమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. తల్లి, చెల్లికి ఆస్తి ఇవ్వనంటూ కోర్టుకెళ్లడం జగన్ క్రూర మనస్తతత్వానికి నిదర్శనమన్నారు. జగన్ అనుభవిస్తున్నఆస్తి ప్రజలదేనని అందులో కనీసం మూడో వంతు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సరస్వతి పవర్‌కు కేటాయించిన ప్రభుత్వ భూమి లీజును అడ్డగోలుగా పొడిగించుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ళ పాటు పరిశ్రమ ప్రారంభించలేదని గుర్తుచేశారు. చట్ట వ్యతిరేకంగా చేసిన భూకేటాయింపులు, లీజులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.