APCC Chief YS Sharmila Complaint to Governor : మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఖాళీ చెక్కులా అదానికీ రాసి ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను 'అదానీప్రదేశ్'గా మార్చేశారని మండిపడ్డారు. రూ. 1,750 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆధారాలతో సహా వ్యవహారం బయటకొస్తే జగన్ ఇప్పటివరకు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం వెళ్లి గవర్నర్ అబ్దుల్‌నజీర్‌కు జగన్ హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.