Congress State President Sharmila Comments On YS Jagan : వైఎస్సార్సీపీ విశ్వసనీయతను కోల్పోయింది, వైఎస్సార్ మంచి పేరు సాధిస్తే జగన్ చెడ్డపేరు తెచ్చుకున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైఎస్సార్‌కి జగన్‌కు పొంతనే లేదన్నారు. ఆ పార్టీ అంతం అయినట్లే, అందులో జగన్ తప్ప ఎవరూ మిగలన్నారు. చివరికి సజ్జల, విజయసాయిరెడ్డి కూడా అందులో ఉండరని జోస్యం చెప్పారు. తిరుపతి లడ్డూ నాణ్యతపై సీబీఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.