Balineni on YS Jagan Property Disputes : వైఎస్సార్ కుటుంబం ఆస్తుల కోసం తగదాలు పడటం బాధాకరమని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య ఆస్తుల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆడబిడ్డ కన్నీరు ఆ ఇంటికి అరిష్టమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.