APCC Chief YS Sharmila Comments on Jagan : జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కల్లేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా అన్నారు. ఒక్కఛాన్స్ పేరిట ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఆమె విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చేశారని మళ్లీ జగన్ రావాలని ఆమె ప్రశ్నించారు.