A Woman Tried to Kiss the CM Chandrababu in Anakapalli District : అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబుకు ఓ అనూహ్య సంఘటన ఎదరైంది. జిల్లాలో శనివారం పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ మహిళ ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. పర్యటన ముగించుకుని సభావేదిక నుంచి కాన్వాయ్ బస్ ఎక్కడానికి వెళ్తున్న క్రమంలో పరవాడకు చెందిన ఒక మహిళ అభిమానంతో తొలుత సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం చంద్రబాబుకు ముద్దుపెట్టడానికి పలుమార్లు ప్రయత్నించగా ఆయన సున్నితంగా తిరస్కరించి, ముందుకు సాగారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.