Krishna River Floods : కృష్ణమ్మ ఉగ్రరూపం ఆక్వా రైతులకు శాపంగా మారింది. భారీ వరదకు కృష్ణా జిల్లా దివిసీమలోని చెరువులన్నీ మునిగిపోయాయి. సరుకంతా చనిపోవడంతో పెట్టుబడంతా నీటి పాలై నిండా మునిగిపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.