Krishna River Flood Decrease in Affected Areas : గత నాలుగు రోజులుగా జలవిలయం సృష్టించిన కృష్ణమ్మ శాంతించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం మూడు లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. గత రెండు రోజుల్లోనే ఎనిమిది లక్షల క్యూసెక్కులు వరకు తగ్గింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ పరిస్థితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.