Flood Water Again at Munneru : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షంతో మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతుంది. పరీవాహక ప్రాంత వాసులంతా ముందస్తు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర సర్కార్ సూచించింది. మహబూబాబాద్, గార్ల, బయ్యారం తదితర మండలాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఖమ్మం మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల, పొంగులేటి అధికారులను ఆదేశించారు. ప్రజలంతా అధికారులకు సహకరించాలని కోరారు.