Konaseema Lanka Villages Flooded by Godavari: గోదారి ఉగ్రరూపంతో కోనసీమలోని లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. వర్షం తగ్గినా వారం రోజులుగా వరద నీటిలోనే నానుతున్నాయి. రహదారులు పూర్తిగా మునిగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అల్లూరి జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.