Krishna River Water Issue in Telangana : ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించిందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన వీలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్దేనని తీవ్రంగా విమర్శించారు.