Skip to playerSkip to main contentSkip to footer
  • 1/23/2021
India vs Australia : It was a debut over two years after his actual debut and Shardul Thakur says he took a quantum leap from being just a fast bowler to a bowling all-rounder with his impactful show in India's epoch-making Brisbane Test triumph over Australia.
#ShardulThakur
#MohammadSiraj
#TeamIndia
#RohitSharma
#SteveSmith
#RishabhPant
#IndvsAus4thTest
#BrisbaneTest
#TimPaine
#ChateshwarPujara
#AjinkyaRahane
#DavidWarner
#MayankAgarwal
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#Cricket

చివరి టెస్టులో ఐదు వికెట్లు తీయలేకపోయినందుకు తనకెలాంటి బాధ లేదని టీమిండియా ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ తెలిపాడు. అయిదు వికెట్ల ఘనత హైదరాబాదీ పేసర్ మొహ్మద్ సిరాజ్‌ సాధించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, అతడు అయిదు వికెట్లు సాధించాలని కోరుకున్నానని తెలిపాడు. ఆసీస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న శార్దూల్‌ ఠాకూర్‌ సిరీస్‌లో తన అనుభవాలు పంచుకున్నాడు. 'ఇక నుంచి నన్ను బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పిలుస్తారు. నాకు బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. భవిష్యత్‌లోనూ రాణిస్తా. క్రీజులోకి దిగాల్సిన పరిస్థితి వస్తే పరుగులు సాధించి జట్టుకు తోడ్పడతా. అయితే బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో ఆడటం అంత సులువు కాదు. గబ్బాలో వారి రికార్డులు అందరికీ తెలుసు. అయినా వాళ్లని ఓడించాం. ఆఖరి టెస్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించినందుకు ఎంతో సంతోషంగా ఉంది' అని శార్దూల్‌ తెలిపాడు.

Category

🥇
Sports

Recommended