ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆలయ ఘటనలపై సీఎం జగన్ ఇవాళ మరోసారి సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలకు కారకులను వెతికి పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని, విపక్షాలతో పాటు మీడియాకూ అవకాశం ఇవ్వొద్దని కలెకర్లు, ఎస్పీలకు జగన్ సూచించారు. ఆలయాల్లో విగ్రహాల విధ్వంసం జరుగుతున్న సమయం, ఇతర పరిస్ధితులను బట్టి చూస్తుంటే గెరిల్లా తరహా యుద్దం జరుగుతున్నట్లుందని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి కారకులను శిక్షించే విషయంలో ఎవరినీ లెక్క చేయొద్దని జగన్ ఆదేశాలు జారీ చేశారు.