న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 నుంచే కేన్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా క్రీజులోకి వచ్చాడంటే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కూడా తన టాప్ బ్యాటింగ్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన విలియమ్‌సన్.. రెండవ టెస్టు మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. 327 బంతుల్లో 24 బౌండరీలతో ద్విశతకం అందుకున్నాడు. దీంతో 2021లో మొదటి ద్విశతకం బాదిన ఆటగాడిగా నిలిచాడు.