ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓడిపోయిన టీమిండియా సిరీస్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. దీంతో విరాట్ కోహ్లీ సారథ్యంపై మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. కోహ్లీ కెప్టెన్సీ తనకు ఏం అర్థం కావడం లేదని, భారత ప్రధాన బౌలర్ల సేవలను విరాట్ సరిగ్గా వాడుకోవడం లేదన్నాడు. రెండు రోజులు తిరిగేసరికి.. తిట్టిన నోటితోనే కోహ్లీని ప్రశంసల్లో ముంచెత్తాడు గౌతీ.