Skip to playerSkip to main contentSkip to footer
  • 10/2/2020
IPL 2020, SRH vs CSK: TOSS UPDATE: Warner has won the toss and elected to bat.MS Dhoni needs 2 sixes to complete 300 sixes in T20s.

#IPL2020
#SRHvsCSK
#SunrisersHyderabad
#ChennaiSuperKings
#DavidWarner
#AmbatiRayudu
#MSDhoni
#MSDhonisixes
#KaneWilliamson

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నెమ్మదైన వికెట్ కావడం, చేజింగ్‌లో ప్రత్యర్థిని కట్టడి చేసే సత్తా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వార్నర్ చెప్పుకొచ్చాడు. ఇక టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పాడు. వికెట్ చాలా నెమ్మదిగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపాడు. ఇక హైదరాబాద్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా చెన్నై మూడు మార్పులు చేసింది. గాయం నుంచి కోలుకున్న అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో జట్టులోకి వచ్చారు. వారితో పాటు శార్దుల్ ఠాకుర్ కూడా తుది జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. గత మ్యాచ్‌ల్లో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్, మురళీ విజయ్, జోష్ హజల్‌వుడ్ ఉద్వాసనకు గురయ్యారు.

Category

🥇
Sports

Recommended