కరోనా వైరస్ సినీ ప్రపంచాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించగా.. సినిమా థియేటర్స్, షూటింగ్స్ అన్ని మూలనపడ్డాయి. థియేటర్స్ మళ్లీ ఎప్పుడు ప్రారంభం అవుతాయో.. సినిమా షూటింగ్స్ తిరిగి ఎప్పుడు మొదలువుతాయో ఎవరికీ తెలియడం లేదు. ఈ క్రమంలో కొంతమంది చిన్న నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ నిర్ణయంపై ప్రముఖ సంస్థ పీవీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేసింది.