Skip to playerSkip to main contentSkip to footer
  • 11/29/2018
AICC President given open offer to TDP chief ChandraBabu Naidu. Rahul offered congress support in Ap and alliance may contest as per Chandra Babu decision. This development may lead to new political developments in AP.
# TelanganaElections2018
#ChandraBabuNaidu
#RahulGandhi
#mahakutami
#trs
#ysjagan

ఏపి రాజ‌కీయాల్లో కొత్త ట్విస్ట్. ఏపి లో కాంగ్రెస్ లో నిర్ణ‌యాధికారం సైతం ప‌రోక్షంగా చంద్ర‌బాబుకే అప్ప‌గించిన‌ట్లుగా రాహుల్ వ్యాఖ్య‌లు క‌నిపిస్తున్నాయి. జాతీయ రాజ‌కీయాల పేరుతో ఒకే వేదిక పైకి వ‌చ్చిన రాహుల్ - చంద్ర‌బాబు తెలంగా ణ‌లో క‌లిసి పోటీ చేస్తున్నారు. తెలంగాణ‌లో అధికారం కోసం కాకుండా కెసిఆర్ ను గ‌ద్దె దింప‌ట‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు కాంగ్రెస్ తో క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఇందు కోసం కేవ‌లం 13 సీట్ల‌తో స‌రి పెట్టుకున్నారు. ఎక్కువ సీట్ల డిమాండ్ ను సైతం ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. దీంతో...రాహుల్ వ‌ద్ద చంద్ర‌బాబు ప‌ర‌ప‌తి బాగా పెరిగింది. ఒక ర‌కంగా ఏపి - తెలంగాణ లో చంద్ర‌బాబు చెప్పిన విధంగా రాహుల్ నిర్ణ‌యాలు తీసుకొనే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇందులో భాగంగానే.. ఏపి భ‌విష్య‌త్ రాజ‌కీయాల పై రాహుల్...చంద్ర‌బాబుకు బంపరాఫ‌ర్ ఇచ్చారు. కానీ, ఇది కాంగ్రెస్ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.

Category

🗞
News

Recommended