India Vs Afghanistan : Ramzan Celebrations By Afghanistan Players
  • 6 years ago
he IPL clearly has its advantages and Indian opener Shikhar Dhawan admits that he has been a direct beneficiary of facing Afghanistan star spinner Rashid Khan at the Sunrisers Hyderabad nets for the past two years. Dhawan smashed his way to a 96-ball-107 and was especially severe on Rashid during his first session century as India finished the day at 347 for 6 on the first day of the historic one-off Test.
#IndiaVsAfghanistan

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆప్ఘనిస్థాన్ క్రికెటర్లు ఈద్ ఉల్ ఫితర్(రంజాన్) పండుగను ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ సందర్భంగా బెంగళూరులో తాము బసచేస్తున్న హోటల్‌లో ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుక్రవారం ఉదయం నమాజ్ అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తమ దేశ సంస్కృతి ప్రతిబింబించేలా ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించిన అప్ఘనిస్థాన్ జట్టు మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానంలోనూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యథావిధిగా తమదేశ జెర్సీ ధరించి రెండోరోజు ఆటకు సిద్ధమయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆప్ఘన్ క్రికెట్ బోర్డు తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ఇదిలా ఉంటే బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టులో టీమిండియా 474 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 347/6తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా ప్రారంభంలోనే అశ్విన్ వికెట్ కోల్పోయింది.
Recommended