The Meteorological Department has predicted that there is a possibility of very heavy rains in the state today and tomorrow. An orange alert has been issued for several districts. It has been revealed that heavy to very heavy rains are likely to occur in Adilabad, Kumuram Bheem Asifabad, Mancherial, Jayashankar Bhupalpally, Mulugu, Bhadradri Kothagudem districts today. Weather Update. ఈ రోజు, రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్ , జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. #weatherupdate #rains #telanganarains