It has been raining in Hyderabad since Tuesday night. Heavy rainfall was recorded in many areas. Many areas including Hitech City, Madhapur, Sheikhpet, Banjara Hills, Yousaf Guda were flooded with rainwater. It started raining since early Wednesday morning. All the roads were flooded due to the rain. Hyderabad Rain. మంగళవారం రాత్రి నుంచి హైదరాబాద్ లో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. హైటెక్ సిటీ, మాదాపూర్, షేక్ పేట్, బంజారాహిల్స్, యూసఫ్ గూడ సహా పలు ప్రాంతాలు వర్షపు నీటితో జలమయం అయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి ముసురు పట్టింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, SR నగర్, ఎర్రగడ్డ, బోరబండ, సనత్ నగర్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. కూకట్పల్లి ఏరియాలో చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి. మాదాపూర్లో రోడ్ల పైకి నీరు చేరుకుంది. #hyderabadrains #rains #hyderabad