NTR Bharosa pensions - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంలో అవకతవకలను అరికట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే దివ్యాంగుల కోటాలో అర్హతల లేని వేలాది మందికి పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు గుర్తించారు. దాంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ తనిఖీలు మొదలు పెట్టింది.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేశారు. వీరిలో ఇప్పటివరకు 4.76 లక్షల మంది అధికారులు జరిపిన రీ-వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. మిగిలిన వారు స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. అయినా హాజరుకాకపోతే పింఛన్లను నిలిపివేసే అవకాశం ఉంది.
The Andhra Pradesh government has initiated a major drive to curb irregularities in the NTR Bharosa pension scheme, particularly under the disabled quota.
Officials found that thousands of ineligible individuals were receiving disability pensions across the state. In response, the government has launched a statewide reverification process.
As part of the drive, notices have been issued to nearly 5 lakh beneficiaries, asking them to verify their eligibility. So far, about 4.76 lakh people have attended the reverification process.
Those who fail to respond will be issued a final notice, and if they still don't comply, their pensions may be suspended.
The government aims to ensure that only genuinely eligible citizens receive pensions under the NTR Bharosa scheme.