CM Revanth Reddy Support Rally for Operation Sindoor : దేశంపై దాడికి పాల్పడిన వారిని పూర్తిస్థాయిలో నిర్మూలించే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు పూర్తిస్థాయిలో మద్దతిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్ ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావ ర్యాలీ నిర్వహించింది.